వాయిదా పడిన పరీక్షల తేదీ వెల్లడి
కడప అగ్రికల్చర్ : దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల నూతన తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్‌వీ కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వారి వారి తేదీల్లో పరీక్షలకు హాజరుకావాలని సీఈ సూచించారు.
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి మూల విరాట్‌లకు అభిషేకాలు, పూజలు జరిపారు.రంగురంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ ప్రాంగణంలో, మాఢవీధుల్లో ఊరేగించారు. పల్లకీ సేవలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి, శేఖర్ స్వామి, రాచరాయయోగీ స్వామి పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై
అప్రమత్తత అవసరం
రాయచోటి టౌన్ : ఎయిడ్స్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో సమాజాన్ని చైతన్యవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులు, వెద్యాధికారులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ గురించి ప్రజలందరూ అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానితులు తగిన పరీక్షలు చేయించుకుని ఏఆర్టీ మందులు వాడాలని సూచించారు అంతకు ముందు ఎయిడ్స్ డే సందర్భంగా డైట్ కళాశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎల్, రాధిక, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్, సీఎస్ ప్రసాద్, డీఎండీవో రామచంద్రారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ చెన్నారెడ్డి, డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి ితదితరులు పాల్గొన్నారు.
మదనపల్లె సిటీ : ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు తత్కాల్ కింద దరఖాస్తుల గడువును పెంచారు. ఈ విషయాన్ని ఓపెన్ స్కూల్ ఇన్‌చార్జి పఠాన్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు 8121852786 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.
బద్వేలు అర్బన్ : ఈ నెల 6, 7వ తేదీల్లో కడప నగరంలో జరగనున్న సీపీఐఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా అభివృద్ధితోపాటు సీమ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. అసలే వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నాలుగు మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. 17 నెలల పాలనలో ప్రతిపక్ష పార్టీలపైన కక్షసాధింపు చర్యలు తీసుకోవడానికే సమయం కేటాయించారని అన్నారు. కడప నగరంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను కడప, రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో అజెండా రూపొందించి భవిష్యత్ పోరాటాలకు శ్రీకారం చుడతామని తెలిపారు.
వాయిదా పడిన పరీక్షల తేదీ వెల్లడి


