
రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం
కొండాపురం : మండలంలోని కె.సుగుమంచిపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడ్డొల్ల స్వాతి(13) మృతి చెందారు. తాళ్లప్రొద్దుటూరు ఏఎస్‌ఐ రాయపాటిబాసు వివరాల మేరకు.. బుక్కపట్నం గ్రామానికి చెందిన జి.అనిల్, వసంత దంపతులకు చెందిన స్వాతి దత్తాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో వతరగతి చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కె.సుగుమంచిపల్లె పునరావాస కేంద్రం సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద తన బంధువుల ఆమ్మాయిని ఆటో ఎక్కించి తిరిగి రోడ్డు నుంచి ఎడమవైపు నడచి వస్తోంది. కొండాపురం వైపు నుంచి తాడిపత్రికి వెళ్లే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలై స్వాతి అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ ఆయన తెలిపారు.
కాలువలో పడి
ఉపాధ్యాయుడు మృతి
జమ్మలమడుగు : మురికి కాలువలో పడి ఉపాధ్యాయుడు మరణించిన సంఘటన జమ్మలమడుగు పట్టణంలో మంగళవారం జరిగింది. పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మధుబాబు(50) మద్యం తాగి సోమవారం రాత్రి ఇంటికి బయలుదేరాడు. మద్యం ఎక్కువగా తాగడంతో నడవలేని స్థితిలో కన్నెలూరు మోటు వద్ద మురికి కాలువలో పడి పోయాడు. ఎవ్వరూ గుర్తించకపోవడంతో అక్కడే మృతిచెందాడు. ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కాలువలో నుంచి బయటికి తీసి పోర్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
పీలేరురూల్ : అసాంఘిక శక్తుల నిర్మూలనే లక్ష్యంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ మంగళవారం పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. పీలేరులోని ప్రముఖ కేంద్రాలు, కార్యాలయాలు, రైల్వే స్టేషన్, ప్రభుత్వాస్పత్రి, ఆర్టీసీ బస్టాండ్, వారపు సంత ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు సీఐ యుగంధర్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం