
ధ్వజస్తంభం సంప్రోక్షణకు అంకురార్పణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అర్చకులు ధ్వజస్తంభం సంప్రోక్షణకు మంగళవారం అంకురార్పణ నిర్వహించారు. ఒంటిమిట్ట రామాలయంలో దెబ్బతిన్న ధ్వజ స్తంభం పీఠం, బలిపీఠాలకు రూ.15.50 లక్షలతో నూతన ఇత్తడి కవచాలను అమర్చే పనులు పూర్తయ్యాయి. దీంతో సంప్రోక్షణకు సాయంత్రం పవిత్ర పుట్టమన్ను తీసుకువచ్చి అంకురార్పణ చేశారు. ఆలయ రంగమండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి, నూతన పట్టు వస్త్రాలు తొడిగి, బంగారు ఆభరణాలతో అలంకరిచారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తు హోమం, ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించారు. నేడు ధ్వజస్తంభానికి సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు హనుమంతయ్య, నవీన్ కుమార్, అమర్‌నాథ్‌రెడ్డి, అర్చకులు శ్రావణ్ కుమార్, వీణారాఘవాచార్యులు, పవన్ కుమార్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.

ధ్వజస్తంభం సంప్రోక్షణకు అంకురార్పణ