
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఒకరి పరిస్థితి విషమించిన ఘటన మంగళవారం జరిగింది. బి.కొత్తకోటకు చెందిన రాజప్ప కుమారుడు గంగాధర్ (33) భార్య సులోచనతో కలిసి చంద్రాకాలనీలో నివాసముటున్నా డు. కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది బసినికొండ సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తానే స్వయంగా తన బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు. సమాచారం అందుకున్న బావ మరిది ఇతరులతో ఘటనాస్థలానికి వెళ్లి బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అదే విధంగా పోతబోలుకు చెందిన నారాయణయ్య కుమారుడు ఎం.తరుణ్ కుమార్(23) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఇంటివద్దే హార్పిక్, గన్నేరుపప్పు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాధితుడిని కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పట్టణంలోని ఎన్‌టీఆర్ సర్కిల్ కోకిలబార్ వద్ద నివాసం ఉన్న వెంకటస్వామి కుమారుడు కిరణ్ కుమార్(25) కుటుంబసమస్యలతో పురుగుమందు తాగి ఇంటివద్దే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.