జిల్లా కలెక్టర్‌గా నిశాంత్‌ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌గా నిశాంత్‌ కుమార్‌

Sep 12 2025 6:11 AM | Updated on Sep 12 2025 6:31 AM

జిల్లా కలెక్టర్‌గా నిశాంత్‌ కుమార్‌ క్రీడాభారతి పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి ఏఐతో గ్లోబల్‌ అవకాశాలు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

రాయచోటి: అన్నమయ్య జిల్లా నూతన కరెక్ట్‌ గా నిశాంత్‌ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ శాఖ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారు.. స్థానికంగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది జూలై 7వ తేదీన శ్రీధర్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

మదనపల్లె సిటీ: క్రీడాభారతి ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా జ్ఞాన పరీక్ష–25 దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభారతి అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌, నరేష్‌ తెలిపారు. వ్యక్తిగత, బృందం కుటుంబం, స్నేిహితుల కూటమి విభాగాలుగా క్రీడాభారతి డాట్‌ ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. ఈనెల 14వ జరిగే ఆన్‌లైన్‌ పరీక్షలో 25 నిమిషాల్లో 50 క్రీడా క్విజ్‌ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందులో ఎక్కువ మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, రెండో స్థానం పొందిన వారికి రూ.50వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, నాలుగో స్థానం పొందిన వారికి రూ.10వేలు చొప్పున బహుతులు అందజేయనున్నట్లు చెప్పారు.

కురబలకోట: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ)తో గ్లోబల్‌ అవకాశాలు లభిస్తాయని, ఇది ప్రపంచంలో సరికొత్త ప్రబల సాంకేతిక శక్తిగా మారుతోందని తమిళనాడులోని కేఎస్‌ రంగస్వామి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ ఆర్‌. గోపాలకృష్ణన్‌ అన్నారు. అంగళ్లు మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగిన కేరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమంలో గురువారం ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏఐ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాన్ని సృష్టిస్తోందన్నారు. సాఫ్ట్‌, టెక్నికల్‌ స్కిల్స్‌, లీడర్‌షిప్‌ నైపుణ్యాలతో ఉపాధి, ఉద్యోగావకాశాలు సాకారం అవుతాయన్నారు. భవిష్యత్‌ ప్రపంచాన్ని శాసించేది కూడా ఏఐయేనన్నారు.వివిధ రంగాల్లో కీలకంగా మారుతున్న ఈ టెక్నాలజీపై విద్యార్థులు పట్టు సాధించి భవిష్యత్‌ నిర్మాణం చేసుకోవాలని సూచించారు.

రాయచోటి టౌన్‌: రైతులు ఎరువులు, పురుగుమందులను వ్యవసాయ అధికారుల సూచనల మేరకే వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి జి. శివనారాయణ తెలిపారు. గురువారం గొర్లమొదివీడు, యండపల్లె గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులుసేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల నాణ్యతతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. భూమి సారవంతంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీలత, డీపీఎం బీవీ మోహన్‌, రాయచోటి ఎంఏవో రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు..

జిల్లా కలెక్టర్‌గా  నిశాంత్‌ కుమార్‌
1
1/2

జిల్లా కలెక్టర్‌గా నిశాంత్‌ కుమార్‌

జిల్లా కలెక్టర్‌గా  నిశాంత్‌ కుమార్‌
2
2/2

జిల్లా కలెక్టర్‌గా నిశాంత్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement