
తైక్వాండో జిల్లా జట్టుకు ఎంపిక
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్‌లో మంగళవారం ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–14, 17 బాల బాలికల జిల్లా స్థాయి తైక్వాండో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలను ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జార్జికారొనేషన్ క్లబ్ కార్యదర్శి మార్తల సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలగంగిరెడ్డి, ఈసీ మెంబర్ రామసుబ్బారెడ్డి, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటమురళీమోహన్, శివారెడ్డి, శివకృష్ణ, అల్లాబకాష్, రాఘవ తదితరులు పర్యవేక్షించారు.