
● ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు
● ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు
అమ్మవారి ఆలయంలో లభించే తలనీలాలకు విదేశాల్లో అధిక డిమాండ్ ఉండటంతో.. వేలం పాటలు రికార్డు స్థాయిలో పలుకుతుండటం గమనార్హం. దీంతో బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వేలం పాటలో పోటీ బాగా పెరిగింది.
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు తరలివస్తారు. గతంలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు మాత్రమే వేలం పాట పాడేవారు. ఈ ఏడాది రూ.18.76 లక్షలకు వేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు.