
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
కడప అర్బన్ : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని.. పోలీసు, జ్యుడిషియల్ శాఖల అమలులో నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే నేరాలను అరికట్టగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2025 అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తోపాటు, కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్, సెవెంత్ ఏడీజే జీఎస్ రమేష్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌న్ ఖదీరున్, ఫోరెన్సిక్ ఐ.టి నిపుణులు సురేంద్ర కుమార్ హాజరయ్యారు. ఈ సమీక్షలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఆటవీశాఖ, ఫైర్, జైలు, జ్యుడిషియల్ శాఖల అధికారులతో.. ఆరు నెలల కాలంలో నమోదైన గ్రేవ్ – నాన్ గ్రేవ్, హత్య, ఫొక్సో, అత్యాచారం, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సీఆర్‌పీసీ కేసులు, ఎనన్‌ఫోర్స్‌మెంట్ వర్క్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, డీఐజీ, ఎస్పీలు సమీక్ష నిర్వహించారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్‌కి గుడ్ బై చెబుదాం, డ్రగ్స్ వద్దు బ్రో, మాదకద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయాలనే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, రైల్వే, న్యాయ, రెవెన్యూ, ఫారెస్ట్, రవాణా, ఎక్సయిజ్, వైద్య, ఫైర్, జైళ్ల శాఖ, తదితర అధికారులు, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ అధికారులకు ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభం
పోలీస్ అధికారులకు ఫైరింగ్‌లో ప్రాక్టీస్‌ను డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీఎఫ్‌ఓ వినీత్ కుమార్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి
అర్ధ వార్షిక నేర సమీక్షలో పాల్గొన్న డీఐజీ, ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం