
● వసతుల లేమి.. తప్పని ఇబ్బందులు
మదనపల్లె : మదనపల్లె పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు బాలుర, రెండు బాలికలకు, ఒక కళాశాల ఎస్సీ హస్టళ్లు, బీసీ సంక్షేమ హాస్టళ్లు ఐదు, గిరిజన సంక్షేమ హస్టల్ ఒకటి నడుస్తున్నాయి. వీటిలో ఒక్క హాస్టల్‌లోనూ నిబంధనల ప్రకారం, మెనూ ప్రకారం ఏది జరగడం లేదు. మగురుదొడ్లు, దుప్పట్లు, బెడ్లు, తాగునీటి ఇబ్బందులు నెలకొన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట గురుకుల విద్యాలయ విద్యార్థుల అవస్థల మధ్య ఉంటున్నారు. తంబళ్లపల్లెలో బీసీ హాస్టల్‌ను ప్రభుత్వం మూసివేయగా ఎస్టీ బాలుర హాస్టల్ విద్యార్థులకు మంచినీరు కరువైంది. సౌకర్యాల మాటే లేదు. మిగతా హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి.

● వసతుల లేమి.. తప్పని ఇబ్బందులు