
కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భర్తతో గొడవపడి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండకు చెందిన మహమ్మద్ అలీ, పర్వీన్(36) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మహమ్మద్ అలీ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల కొంత కాలంగా మహమ్మద్ అలీ మద్యానికి బానిస కావడంతో కుటుంబలో సమస్యలు తలెత్తి తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి మహమ్మద్ అలీ మద్యం తాగి ఇంటికి రాగా.. వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి చీరతో ఫ్యానుకు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన ఆస్పత్రి, అత్యవసర విభాగ వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు.