రాజ్యాధికారంతోనే బీసీల అభ్యున్నతి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాధికారంతోనే బీసీల అభ్యున్నతి

Jul 27 2025 6:46 AM | Updated on Jul 27 2025 6:46 AM

రాజ్యాధికారంతోనే బీసీల అభ్యున్నతి

రాజ్యాధికారంతోనే బీసీల అభ్యున్నతి

కడప రూరల్‌ : రాజ్యాధికారంతోనే బీసీ వర్గాల అభ్యున్నతి సాధ్యమని బీసీ కులాల వేదిక నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కులానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించడం, బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా వేదిక పని చేస్తుందని వారు స్పష్టం చేశారు. కడపలోని బీసీ భవనంలో శనివారం బీసీ కులాల వేదిక ఆధ్వర్యంలో బీసీ కులాల రాయలసీమ జిల్లాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పార్టీలు బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పార్టీ ఎన్నికలకు ముందు బీసీ కులాలకు వరాలు ఇవ్వటం, గెలిచిన తరువాత మరిచిపోవటం పరిపాటి అయ్యిందని పేర్కొన్నారు. ఇక నుంచి ఓట్లు మావి సీట్లు కూడా మావే అనే నినాదంతో బీసీ కులాల వేదిక పని చేస్తుందని అన్నారు. స్థానికంగా జనాభా ఉన్న కులాలకు మాత్రమే అన్ని పార్టీలు అవకాశం ఇస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా జనాభా ఉన్న కులాలను పట్టించుకోవటం లేదని తెలియజేశారు. నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు ఇంటూరి బాబ్జి నంద మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేని కులాలను అసెంబ్లీ, పార్లమెంట్‌ లోకి తీసుకొని పోవటానికి ప్రతి బీసీని చైతన్యం చేస్తామని తెలియజేశారు. 150కి పైగా ఉన్న బీసీ కులాలలో కేవలం 5, 6 కులాలకే అన్ని పార్టీలు ప్రాధాన్యత కల్పిస్తున్నాయని మిగిలిన కులాలను డబ్బులు లేవనో, కుల జనాభా లేదనో చట్టసభల్లో అవకాశం కల్పించటం లేదని అన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేని కులాలు తమ హక్కులను సాధించుకోలేవని, బీసీలు రాజ్యాధికారంలో ఉంటేనే రాజ్యంగాన్ని మార్చాగలరని, ఆ దిశగా బీసీ కులాల వేదిక కృషి చేస్తుందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు

కుమ్మర శాలివాహన రాష్ట్ర నాయకులు గొల్లపల్లి లలిత్‌ ప్రజాపతి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోనే బీసీల రిజర్వేషన్స్‌ సరిగా జరగలేదని, బీసీలకు కేవలం విద్యా, ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్స్‌ కల్పించారని దానికి కూడా క్రీమిలేయర్‌ పెట్టి రిజర్వేషన్స్‌ ఫలాలు బీసీలకు సరిగా అందకుండా చేశారన్నారు. దళితులకు జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగాలు, రాజకీయాలలో రిజర్వేషన్స్‌ కల్పించి రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేశారన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్స్‌ కల్పించకపోవటం, రక్షణ చట్టం ఏర్పాటు చేయకపోవడంతో రిజర్వేషన్స్‌ వల్ల సరైన ఉపయోగం లేదని అన్నారు. అగ్నికుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షులు నాగిడి సాంబశివరావు మాట్లాడుతూ బీసీలను ఐక్యం చేయటానికి బీసీ కులాల వేదిక కృషి చేస్తుందని, తమ కులాల గుర్తింపు కోసం వచ్చే వారిని ప్రోత్సహిస్తూ, వారిని సమాజంలో నాయకులుగా నిలబెడతామని తెలియజేశారు. ఇప్పటికే కోస్తా, ఉత్తరాంధ్రలో సమావేశాలు ఏర్పాటు చేసి, అన్ని కులాల వారి అభిప్రాయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి, అందరి సమష్టి అభిప్రాయాలతో విధానాలు రూపొందించి లక్ష మందితో రాష్ట్ర రాజధానిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. అలాగే పలు కులాల రాష్ట్ర, జిల్లా నాయకులు, మేధావులు మాట్లాడుతూ ఈ వేదికకు తమ మద్దతు తెలియజేశారు. బీసీల అభివృద్ధి కోసం మిగతా కులాల వారందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సంచార జాతుల రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి మనోజ్‌ కుమార్‌, నూర్‌ బాషా పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ బాదుల్లా, దాసరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బయ్య, బీసీ చైతన్య సమితి అధ్యక్షులు బీసీ రమణ, యాదవ సంఘం నాయకులు ఓబులేసు యాదవ్‌, రాష్ట్ర రజక నాయకులు బద్వేల్‌ గురుమూర్తి, బోయ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ మల్లెల భాస్కర్‌, తొగట వీర క్షత్రియ రాష్ట్ర నాయకులు మల్లికార్జున, సగర రాష్ట్ర నాయకులు రామచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజధానిలో బహిరంగ సభ..

ఉద్యమ కార్యాచరణ

సమావేశంలో బీసీ కులాల వేదిక నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement