
8 ఎర్రచందనం దుంగల పట్టివేత
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు అటవీ శాఖ పరిధిలోని కోడూరు రేంజ్ నాగులపెంట బీట్ వద్ద శనివారం రేంజర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో కూంబింగ్ చేపట్టారు. తమిళనాడుకు చెందిన ఆనంద్‌రాజ్ జయశంకర్ 1 లక్షా 22 వేల విలువ చేసే 8 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అధికారులు దాడులు చేసి పట్టుకొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. దాడుల్లో అటవీ శాఖ సిబ్బంది రమణ, మహేష్‌శంకర్, దామోదర్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
బాత్‌రూమ్‌లో జారిపడి
ఏపీఎస్పీ సీఐ మృతి
మదనపల్లె రూరల్ : బాత్‌రూమ్‌లో జారిపడి ఏపీఎస్పీ సీఐ మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. తంబళ్లపల్లె మండలం కొటాలకు చెందిన పిల్లస్వామినాయక్ కుమారుడు కృష్ణానాయక్ (58) పట్టణంలోని రెడ్డీస్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన చిత్తూరులోని ఏపీఎస్పీ 8వ బెటాలియన్ సీఐగా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవులో ఇంటికి వచ్చారు. హైదరాబాదులో పనులు ముగించుకుని వచ్చిన ఆయన శనివారం ఉదయం బాత్‌రూమ్‌కు వెళ్లి జారిపడటంతో అక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన ఇద్దరు భార్యల్లో మొదటి భార్య రమణిభాయ్ 2003లో మృతి చెందగా, ఆమెకు రాఘవేంద్రనాయక్, గీతాభాయ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రెండో భార్య సునీతతోపాటు ఆమె కుమార్తె శృతి ఉన్నారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ సీఐ కృష్ణకుమార్ పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

8 ఎర్రచందనం దుంగల పట్టివేత