పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట | - | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Dec 17 2023 11:58 PM | Updated on Dec 18 2023 10:04 AM

- - Sakshi

కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికులు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆదివారం తాలూకా పోలీసులను ఆశ్రయించారు.

మదనపల్లె : కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికులు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆదివారం తాలూకా పోలీసులను ఆశ్రయించారు. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ తుమ్మల తాండాకు చెందిన శంకరనాయక్‌ కుమారుడు గణేష్‌నాయక్‌(22) తిరుపతిలో ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీకాళహస్తికి చెందిన సుధాకర్‌గౌడ్‌ కుమార్తె గీతావాణి తిరుపతిలో ఎంసీఏ చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే గీతావాణి తల్లిదండ్రులకు ప్రేమవివాహం ఇష్టం లేదు.

దీంతో గీతావాణి రెండురోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి, ఆదివారం మదనపల్లెలోని ప్రియుడు గణేష్‌నాయక్‌ ఇంటికి వచ్చేసింది. ఇద్దరూ కలిసి పట్టణంలోని అయోధ్యనగర్‌ రామాలయంలో కులాంతర వివాహం చేసుకున్నారు. గీతారాణి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంటుందని భయపడి తాలూకా పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. ప్రేమికులిద్దరూ మేజర్లు కావడంతో రక్షణ కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement