‘సకల శాఖల మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే’ | YSRCP Student Wing And Leaders Protest Over DSC Issue In AP | Sakshi
Sakshi News home page

‘సకల శాఖల మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే’

May 29 2026 10:59 AM | Updated on May 29 2026 1:37 PM

YSRCP Student Wing And Leaders Protest Over DSC Issue In AP

ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు,  నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అనంతపురం..

  • డీఎస్సీ స్కాంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
  • అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విద్యార్థి విభాగం నేతలు
  • విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
  • ఉరేసుకుని విద్యార్థుల వినూత్న నిరసన
  • టీడీపీ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు
  • ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
  • విద్యార్థి విభాగం నేతల ఆందోళనకు సంఘీభావం తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు
     

గుంటూరు..

  • పానుగంటి చైతన్య వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు కామెంట్స్..
  • ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు.
  • అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసింది
  • ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఒక అక్రమాల పుట్ట
  • డీఎస్సీ పరీక్ష గందరగోళంగా మారింది
  • డీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారించాలి
  • విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి

మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్...

  • ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ
  • పరీక్షలు నిర్వహించే వారు ఎలా డీఎస్సీ పరీక్ష రాస్తారు
  • లోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారు
  • స్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగాలను లోకేష్ అమ్ముకున్నారు
  • లోకేష్ కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి
  • డీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్‌..

  • దేశంలో చంద్రబాబు లాంటి దరిద్రపు ప్రభుత్వం ఎక్కడా లేదు
  • యువకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది
  • డీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలి
  • నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి

కర్నూలు..

  • ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్‌..
  • రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన.
  • రాష్ట్రంలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేశారు.
  • మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగింది
  • విద్యాశాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.
  • డీఎస్సీలో మెరిట్ విద్యార్థుల పేర్లను మంత్రి లోకేష్ తప్పించారు.
  • అభ్యర్థులు నుండి నేరుగా డబ్బులు ముట్టినట్లు సమాచారం.
  • డీఎస్సీలో అన్యాయం జరిగిందని అడిగితే కేసులు పెడుతున్నారు.
  • డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 

 

విశాఖ..

  • డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట..
  • డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలి పార్టీ శ్రేణుల ఆందోళన..
  • అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నేతలు..
  • కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు తదితరులు..


నెల్లూరు..

  • నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన
  • డీఎస్సీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై ఆందోళన
  • నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆగ్రహం
  • నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, కూటమి ప్రభుత్వ పరిపాలన లోపంపై మండిపాటు

ఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమంలో భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.

భూమన కామెంట్స్‌..

  • డీఎస్సీ అక్రమాలకు బాధ్యత చేస్తూ  రాజీనామా చేయాలి

  • ఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారు

  • ఓసీ ఓపెన్ కటాఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు అన్యాయం చేశారు

  • బీసీ, ఎస్సీ, ఎస్టీలు మెరిట్‌లో వచ్చినా రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేశారు, ఓపెన్ కేటగిరిలో అన్యాయం చేశారు

  • ఓపెన్ కేటగిరి కటాఫ్ బయట పెట్టాలి

  • రిజర్వేషన్  లేకుండా కొన్ని లక్షలు మందికి అన్యాయం చేశారు

  • దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.

  • స్పోర్ట్స్ కోటాలో అదనపు కోట కలిపి, శాప్ చైర్మన్ రవినాయుడు అర్హత లేని వారికి ఉద్యోగాలు

  • 3.50 లక్షలు మంది డీఎస్సీ రాస్తే.. వాళ్లకు కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చాయి

  • ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా..

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వ్యాఖ్యలు..

  • మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి

  • దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.

  • సకల శాఖ మంత్రి నారా లోకేష్ భారీ ఎత్తున కోట్లు అవినీతికి పాల్పడ్డారు

 

Advertisement
 
Advertisement
Advertisement