డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట | YSRCP movement against DSC scam | Sakshi
Sakshi News home page

డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట

Jul 30 2026 4:30 AM | Updated on Jul 30 2026 4:30 AM

YSRCP movement against DSC scam

డీఎస్సీలో మొదటి నుంచి చివరి వరకు జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట ప్రకటించింది. ఈ కుంభకోణంపై సీబీఐ విచా­రణ జరిపించాలని, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి కింద రూ.3,000 చొప్పున వెంటనే ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ విడుదల చేసింది. 

ఈ మేరకు బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ డిమాండ్లకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యా­యి. ఈ ఆందోళన కొనసాగింపులో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ ఆదేశాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రకటించారు. వీటిని యువత, విద్యార్థులతో కలిసి పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. 

కార్యాచరణ ఇలా..
రేపు (శుక్రవారం): వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం అందజేయాలి.
ఆగస్టు 3 లేదా 4వ తేదీన: నియోజకవర్గ స్థా­యిలో టౌన్‌ హాల్‌ మీటింగ్స్‌ ఏర్పాటు చేయాలి.
ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు: నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలి.
ఆగస్టు 10వ తేదీ: నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement