రైతులకు అండగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి

Ysrcp Mla Siva Prasad Reddy Held Raithu Sabha At Proddatur - Sakshi

వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద బుధవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి, మంత్రి కన్న బాబు, ఎంపీ అవినాష్‌ రెడ్డి,  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో.. రైతాంగానికి అండగా నిలుస్తున్నామని నిరూపిస్తూ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి  రూ.2 కోట్లతో నియోజకవర్గ రైతులకు 23 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వీటిని 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పగించనున్నారు. 

ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తన నియోజక ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. మరో వైపు రాష్ట్ర​ ప్రభుత్వం విద్య , వైద్యం , వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో తండ్రికి తగ్గ తనయుడిగా నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. రైతాంగానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, వారి కోసం డ్రిప్ ఇరిగేషన్ త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ రాబందులాగా శవాల కోసం ఏడురుచూస్తున్నాడని, రాష్ట్రంలో  ఎక్కడ శవం కనిపించినా అక్కడ వాలిపోయి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడంటూ విమర్శించారు.

చదవండి: మహిళలు, బాలికల పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top