‘వెన్నుపోటుకు సిల్వర్‌ జూబ్లీ చేసుకోవడం సిగ్గు చేటు’ | YSRCP MLA Kolusu Parthasarathy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు

Sep 1 2020 6:25 PM | Updated on Sep 1 2020 7:30 PM

YSRCP MLA Kolusu Parthasarathy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వెన్నుపోటుకు టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చేసిన వెన్నుపోటుపై ప్రజలు తలదించుకుంటున్నారు. ఎన్టీఆర్‌పై కుట్రలు పన్ని ఆయనను పదవి నుంచి దించడమే కాకుండా చెప్పులతో కొట్టి అవమానించారు. టీడీపీ నేతలు చేస్తున్న పనికి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది. ఆయన నుంచి అన్యాయంగా పార్టీతో పాటు సింబల్‌ని కూడా లాక్కున్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు భారత రత్న అవార్డ్‌కు సిఫార్సు చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా బలంతో అధికారంలోకి వస్తే.. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చారు. 25 ఏళ్ళలో చంద్రబాబు రాష్ట్రనికి చేసింది ఏమీలేదు. ఒక్క పథకం కూడా చంద్రబాబు పేరు గుర్తుకు వచ్చేలా పెట్టలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (చదవండి: తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే)

అంతేకాక ‘మీడియా మేనేజ్మెంట్‌తో చంద్రబాబు బతుకుతున్నారు. వ్యవసాయం దండగన్న సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం ఎత్తివేసిన ఘనత చంద్రబాబుది. ఆయన ఇచ్చిన లేఖతో రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక హోదకు బదులు ప్యాకేజీకి అంగీకరించారు. అమరావతిలో 55 వేల కోట్లకు టెండర్లు పిలిచి ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హీరోనా...151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి హీరోనా’ అంటూ పార్థసారథి ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement