
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే తరగతులు ప్రారంభమైన ఏలూరు మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు
కాలేజీల వద్ద వైఎస్సార్‌సీపీ వేడుకలు
వైఎస్సార్‌సీపీ నాయకుల వేడుకలు
ఆయా కాలేజీల వద్ద కేక్‌లు కట్ చేసి సంబరాలు
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు వేడుకలు నిర్వహించారు. కాలేజీల వద్ద కేక్‌లు కట్ చేసి తమ సంతోషం వ్యక్తం చేశారు. వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెర తీస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది. తొలి విడతగా 2023–24 విద్యా సంవత్సరంలో ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. సరిగ్గా రెండేళ్ల క్రితం.. సెప్టెంబర్ 15న అప్పటి సీఎం వైఎస్ జగన్ విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించారు.
అలాగే ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను కూడా విజయనగరం నుంచే వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాలేజీల వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం కేక్‌లు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అలాగే తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కూడా ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నాయకులు కొమ్మూరి కనకారావు, అంకంరెడ్డి నాగనారాయణమూర్తి, కొండా రాజీవ్, పుత్తా శివశంకర్, షరీఫ్, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, కొండమడుగుల సుధాకర్, పోతుల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.