వైఎస్సార్‌సీపీ నేతలపై ఆగని కూటమి నేతల అరాచకం | YSRCP Leader Sambashivarao Attacked By TDP Leaders In Eluru | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై ఆగని కూటమి నేతల అరాచకం

May 30 2026 5:35 PM | Updated on May 30 2026 5:39 PM

YSRCP Leader Sambashivarao Attacked By  TDP Leaders In Eluru

ఏలూరు:  వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి నేతల అరాచక పర్వం కొనసాగుతూనే ఉంది.  ఏలూరు జిల్లా శోభనాపురంలో వైఎస్సార్‌సీపీ నేత సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సాంబశివరావుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు టీడీపీ నేతలు. 

సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని సాంబశివరావుపై దాడి చేశారు కూటమి నేతలు. గాయపడిన సాంబశివరావును స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పరామర్శించారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ తరహా దాడులు చేస్తారా అంటూ మేకా ప్రతాప్‌ ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement