ఈనాడు పత్రిక​పై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP Files Complaint With Police Against Eenadu Newspaper | Sakshi
Sakshi News home page

ఈనాడు పత్రిక​పై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Mar 28 2026 7:56 PM | Updated on Mar 28 2026 8:25 PM

YSRCP Files Complaint With Police Against Eenadu Newspaper

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఈనాడు పత్రిక​పై పోలీసులకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ట దెబ్బతీసేలా ఈనాడు పత్రికలో కార్టూన్ ప్రచురించారని.. ఈనాడు పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేశారు. జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement