
వైస్సార్ జిల్లా, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో తొలుత.. పెండ్లిమర్రి మండంలోని మాచునూరు గ్రామానికి చేరుకుని ఇటీవల మృతిచెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు దీనిలో భాగంగా చంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వైఎస్ జగన్.
వైఎస్ జగన్‌కు సాదర స్వాగతం
వైఎస్సార్ జిల్లా పర్యటనకు విచ్చేసిన వైఎస్ జగన్‌కు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. కడప ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌కు పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికాయి. ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న వైఎస్ .జగన్.. రేపు ఉదయం నుంచి క్యాంప్ ఆఫీస్‌లో ప్రజలకు, పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు.
