ఈసారి అమ్మ, చెల్లి ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Sensational Comments On CBN Diversion Politics | Sakshi
Sakshi News home page

కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?: వైఎస్‌ జగన్‌

Oct 24 2024 1:23 PM | Updated on Oct 24 2024 3:15 PM

YS Jagan Sensational Comments On CBN Diversion Politics

సాక్షి, విజయనగరం: కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు వైఎస్‌ జగన్‌. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌ గుర్లలో డయేరియాతో​ మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ గుర్లకు వస్తున్నాడని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారు. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకే లడ్డూ అంశం తెరపైకి తెచ్చారు. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం మొదలు పెట్టారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?. 

ఈనాడు, ఏబీఎన్‌, టీవీ-5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలి. మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా.. మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా?.  ఇలాంటివి ప్రతీ ఇంట్లోనూ ఉండే విషయాలే. నిజాలు లేకున్నా వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోండి. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోండి. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు దృష్టిసారించండి అని హితవు పలికారు. ఇదే సమయంలో విజయనగరంలో డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు  వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. డయేరియాతో​ ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీనే ఇంత సాయం చేస్తుంటే.. బాధితులను పరామర్శిస్తుంటే.. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందా? అని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement