తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ‍్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలు తెలుసుకుని, న్యాయపోరాటం చేసేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి.
ఏ కమిటీల్లో ఎవరు?
సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ: పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మంగళగిరి ఇన్‌చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాలవజ్రబాబు
సీఆర్‌డీఏ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శనరెడ్డి, కె.శ్రీనివాస్
డీఎస్సీ పోరాట కమిటీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర
డీఎస్సీ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిశోర్




