సాక్షి, తాడేపల్లి: నాదెండ్ల భాస్కర్ రావు మృతిపై వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. నాదెండ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన నాయకుడని ప్రజాసేవలో ఆయన నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమన్నారు. ఆయన మరణం రాష్టానికి తీరని లోటని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.


