జశ్వంత్‌ సింగ్ మృతికి సీఎం వైఎస్‌ జగన్ సంతాపం‌ | YS Jagan Expressed Grief Over Passing Away Jashwant Singh | Sakshi
Sakshi News home page

జశ్వంత్‌ సింగ్ మృతికి సీఎం వైఎస్‌ జగన్ సంతాపం‌

Sep 27 2020 9:40 PM | Updated on Sep 27 2020 10:37 PM

YS Jagan Expressed Grief Over Passing Away Jashwant Singh - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి జశ్వంత్‌ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తొలుత సైనికుడిగా దేశానికి వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా జశ్వంత్‌సింగ్ ఎన్నికయ్యారని తెలిపారు.దేశ రాజకీయాలలో జశ్వంత్‌ సింగ్ కీలక పాత్ర పోషించారని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి జశ్వంత్‌ సింగ్ మృతి పట్ల వైఎస్సార్‌ సీపీ నేత సీ. రామచంద్రయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జశ్వంత్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జశ్వంత్‌ సింగ్‌ గొప్ప దేశభక్తుడని, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని సి.రామచంద్రయ్య పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement