మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌‌పై దాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan condemns attack on Narsipatnam Former MLA | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌‌పై దాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌

Apr 27 2026 11:28 PM | Updated on Apr 27 2026 11:47 PM

 YS Jagan condemns attack on Narsipatnam Former MLA

సాక్షి, తాడేపల్లి: నర్సీపట్నం ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌‌ గణేశ్‌పై జరిగిన దాడిని ఖండించారు. అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

‘హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడి అనుచరులు ఉమాశంకర్ గణేశ్‌పై దౌర్జన్యం చేశారు. ఉమాశంకర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో విఫలమైన శాంతిభద్రతలకు ఈ సంఘటన నిదర్శనం. 

ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు నిజాన్ని అణచివేయలేవు. ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే స్పందించాలి. దాడికి దిగిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పతనమైన శాంతిభద్రతలను పునరుద్ధరించాలి. ఉమా శంకర్ గణేశ్‌కు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది’ అని వైఎస్ జగన్ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement