పెరుగుతున్న ఎండల తీవ్రత | Temperatures exceed 40 degrees in many parts of the state | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ఎండల తీవ్రత

Mar 15 2025 4:47 AM | Updated on Mar 15 2025 4:47 AM

Temperatures exceed 40 degrees in many parts of the state

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 

సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువ 

ఈ వేసవిలో ఎండ తాకిడి ఎక్కువేనంటున్న వాతావరణ శాఖ 

సాక్షి, అమరావతి: వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు­రో­జుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీ­గా పెరిగాయి. ఉదయం 11 నుంచి మధ్యా­హ్నం 3.30 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటోంది. నిన్నటి వరకు రెండు, మూడు చోట్ల మాత్రమే 40 డిగ్రీలు దాటిన ఎండ.. గురువారం చాలా మండలాల్లో 40 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణో­గ్రత నమోదైంది. 

అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవి సా­­ధారణంకంటే రెండు, మూ­డు డి­గ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబు­తున్నారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 

ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌ రెండో వారానికల్లా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమ శాతం ఎక్కువగానే ఉండడం వల్ల ఉక్కపోత ఉండడంలేదు. అయితే ఎలినినో పరిస్థితుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మున్ముందు ఎండ, వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement