రాష్ట్రంలో టెక్‌ మహీంద్రా స్టార్‌ హోటల్స్‌ | Tech Mahindra Star Hotels in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో టెక్‌ మహీంద్రా స్టార్‌ హోటల్స్‌

Oct 13 2023 5:03 AM | Updated on Oct 13 2023 7:04 PM

Tech Mahindra Star Hotels in the state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో ఫైవ్‌ స్టార్, సెవెన్‌ స్టార్‌ హోటల్స్‌ నిర్మించేందు­కు మహీంద్రా హాలిడేస్‌ చైర్మన్, టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీసీ గుర్నాని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన గురు­­వారం సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యా­రు. స్టార్‌ హోటల్స్‌ ఏర్పాటు గురించి సీఎం జగన్‌కు ఆయన వివరించారు.

ఒక్కో హోటల్‌ నిర్మా­ణానికి రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్‌ వివరించారు. విశాఖ సహా 3 పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటల్స్‌ నిర్మాణం చేపట్టనున్నా­మని.. వచ్చే 2 నెలల్లో శంకుస్థాపన చేపడతామని మహీంద్రా ప్రతినిధులు వెల్లడించారు. మహీ­ంద్రా గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్రా సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్రా విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement