చెబుతాం... ఆచరించం | TDP MLAs And Ministers Not Follow Chandrababu Cabinet Decision | Sakshi
Sakshi News home page

చెబుతాం... ఆచరించం

May 23 2026 8:02 AM | Updated on May 23 2026 9:58 AM

TDP MLAs And Ministers Not Follow Chandrababu Cabinet Decision

ఇంధనం పొదుపునకు తూట్లు  

శుక్రవారం నో వెహికల్‌ డేగా చంద్రబాబు ప్రకటన 

అదే శుక్రవారం రోజున కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు భారీ రోడ్‌షో  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ నేతల మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. పబ్లిసిటీ పీక్‌.. ఇంప్లిమెంటేషన్‌ వీక్‌ అన్నట్టుగా ఉంటుంది. సాక్షాత్తూ ప్రకటన చేసే చంద్రబాబు, ఆయన కుమారుడే దానిని పాటించరు. వారి బాటలోనే మిగతా నాయకులు వెళ్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇంధనం పొదుపు ప్రకటన మేరకు చంద్రబాబు కూడా ఇంధనం పొదుపునకు పిలుపునిచ్చారు. శుక్రవారమైతే నో వెహికల్‌ డేగా ప్రకటించారు. ఆ పిలుపు, ప్రకటన గొప్పగా చెప్పుకున్నారు. 

సరిగ్గా ఇదే రోజున (శుక్రవారం) ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో జరిగిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో పాటు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ భారీ కాన్వాయ్‌తో ర్యాలీ నిర్వహించా రు. మదనాపురం కూడలి నుంచి అల్లెన వరకు రోడ్‌ షో చేశారు. అంతకుముందు జరిగిన పలు కార్యక్రమాలకు కూడా భారీగా వాహనాలతో వెళ్లి పాల్గొన్నారు. 

చంద్ర బాబు, లోకేష్‌ ఎలాగైతే హెలికాప్టర్‌లు, భారీ కాన్వాయ్‌ లతో పర్యటనలు చేసి వారి మాటను వారే తప్పుతున్నారో కేంద్రమంత్రి, ఎమ్మెల్యే తదితరులు అదే బాటలో పయనిస్తున్నారు. తాము చెబుతాం తప్ప ఆచరించం అనే ధోరణిలో వెళ్తున్నారు. టీడీపీ నాయకులు తీరు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.         

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement