అనంతపురం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈరోజు(ఆదివారం, నవంబర్ 2వ తేదీ) తాడిపత్రిలో చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇక్కడ చేయొద్దంటూ టీడీపీకి చెందిన జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు సైతం దిగారు. జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా తాడిపత్రిలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జేసీ వర్గీయులు అడ్డుకోవడమే కాకుండా దాడులకు దిగారు. ఇక్కడకు ఎవరూ రావొద్దంటూ నిరంకుశ పాలనను గుర్తు చేసిన జేసీ వర్గీయులు.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు.


