ఏపీ పోలీస్‌ దేశానికే ఆదర్శం: తానేటి వనిత

Taneti Vanitha In Dsp Passing Out Parade Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: ఏపీ పోలీస్‌ దేశానికే ఆదర్శమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీస్‌ శిక్షణా కళాశాలలో సోమవారం.. డీఎస్పీల పాసింగ్‌ ఔట్‌ పేరేడ్‌ నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, సీఎం జగన్‌ నాయకత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు. సీఎం ఆదేశాలతో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. దిశా యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని, సీఎం జగన్‌ ఏపీ పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేశారని హోంమంత్రి అన్నారు.

మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు: డీజీపీ
ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ముందుకెళ్లాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని, ఫిర్యాదు వచ్చిన వెంటనే సీరియస్‌గా స్పందించాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు.

చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ
చంద్రబాబు లేఖ వ్యవహారంపై స్పందించిన డీజీపీ.. మీడియాతో మాట్లాడుతూ, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. నిజానిజాలు తేలిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు అనుమతి కోరలేదు. టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు’’ అని డీజీపీ స్పష్టం చేశారు.
చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top