
సాక్షి, అమరావతి: తాడేపల్లిగూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు.
చదవండి: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు.. ముగ్గురు సజీవదహనం!