తిరుపతి: వందే భారత్‌ రైలుపై రాళ్లదాడి.. | Stones Pelted On Vande Bharat Express Train In Gudur | Sakshi
Sakshi News home page

తిరుపతి: వందే భారత్‌ రైలుపై రాళ్లదాడి.. ఆర్‌పీఎఫ్‌ అదుపులో ఇద్దరు

Apr 28 2023 7:13 AM | Updated on Apr 28 2023 9:24 AM

Stones Pelted On Vande Bharat Express Train In Gudur - Sakshi

గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో గురువారం దుండగులు వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడిచేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్‌పీఎఫ్‌ సీఐ సందీప్‌ తెలిపారు. 

గురువారం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న రైలు మధ్యాహ్నం గూడూరు దాటిన తరువాత కొండగుంట స్టేషన్‌ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో కొందరు రాళ్లతో దాడిచేసినట్లు చెప్పారు. ఈ దాడిలో రైలు అద్దాలు పగిలాయని, లోపలి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆర్‌పీఎఫ్‌ సీఐ చెప్పారు.   

Advertisement
 
Advertisement
Advertisement