
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలిపి వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. జులై 27న సమగ్ర విచారణ జరుపుతామని డివిజన్ బెంచ్ తెలిపింది. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే ఎన్నికలు జరిపామని ఎస్‌ఈసీ లాయర్ కోర్టుకు వివరించారు.
చదవండి: ఏపీ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు
శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి