నాగుపాముకు నీళ్లు తాగించి..! | Heartwarming Act In Tirupati, Snake Catcher Gives Water to Thirsty Cobra Before Rescue, Viral On Social Media | Sakshi
Sakshi News home page

నాగుపాముకు నీళ్లు తాగించి..!

Apr 7 2026 12:56 PM | Updated on Apr 7 2026 1:55 PM

Snake catcher gave the water to snake drink

 తిరుపతి జిల్లా: పుత్తూరులో మానవత్వాన్ని చాటిన ఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండల మధ్య దాహంతో అలమటిస్తున్న నాగుపాముకు స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ నీళ్లు తాగించి, అనంతరం అడవిలో విడిచిపెట్టాడు.

పుత్తూరులోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగుపాము నీటి ట్యాంక్ కింద దాక్కుంది. దీనిని గమనించిన ఇంటి సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్‌ శ్రీకాంత్ వెంటనే అక్కడికి చేరుకుని జాగ్రత్తగా పామును సురక్షితంగా పట్టుకున్నాడు..

ఎండ తీవ్రతకు పాము దాహంతో అలమటిస్తున్నట్లు గుర్తించిన స్నేక్ క్యాచర్‌ శ్రీకాంత్, దానికి నీళ్లు తాగించాడు. అనంతరం ఆ నాగుపామును సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సమస్య పరిష్కారమవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement