
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆదివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 908 గదిలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఏపీ భవన్ అధికారులు తెలిపారు.