Updates: నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

YSRCP Sidd​ham Sabha: నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్‌

Published Sat, Feb 3 2024 12:13 PM

Siddham Meeting in Denduluru Updates: CM Jagan Public Meeting YSRCP - Sakshi

UPDATES:


05:47 PM, Feb 3, 2024
దెందులూరు వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ..

 • సీఎం జగన్‌ తన ప్రసంగం అనంతరం వేదిక దిగుతుండగా సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, ప్రజాప్రతినిధులు
 • వారితో ఓపిగ్గా సెల్పీలు దిగిన సీఎం జగన్‌

05:14 PM, Feb 3, 2024
ముగిసిన సిద్ధం బహిరంగ సభ

 • సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం
 • తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు

04:14 PM, Feb 3, 2024
సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్‌
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: సీఎం జగన్‌
ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా
దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా
పేదల భవిష్యత్‌ను కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి మీరు సిద్ధమా
రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు
ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్‌ ఒంటరిగానే కనిపిస్తాడు
కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్‌ ఉన్నాడు
జగన్‌ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం
కోట్లాది మంది గుండెల్లో జగన్‌ ఉండటమే నిజం
నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్‌
జగన్‌ ఎప్పటికీ ఒంటరివాడు కాదు
నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరే
నాకున్న నమ్మకం మీరే
వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని
దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే
రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్టచతుష్టయం దాడి చేస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది
మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది
పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు
గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టం కనిపిస్తోంది.

అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం
అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం
175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం
నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా
చంద్రబాబు పాలనకు, జగన్‌ పాలనకు తేడాను గమనించండి
పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి
చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు ఏమున్నాయో అడగండి
కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైన్నా తీసుకోండి
గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి

సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి
ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే జగన్‌ అని చెప్పండి
ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్‌ అందిస్తున్నాం
అసైన్డ్‌ భూములకు శాశ్వత భూహక్కు ఇచ్చాం
డీబీటీ ద్వారా 2 లక్షల 55 కోట్లు పేదలకే అందించా
కేబినెట్‌లో 68 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాం
4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్‌తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం
అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన అందించాం
31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
మీ బిడ్డ జగన్‌ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా
దిశ యాప్‌తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం

రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం
కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్‌ హార్బర్‌లు నిర్మిస్తున్నాం
మహానేత వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం
అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి
వచ్చే ఎన్నికలు.. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేవి
ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే
3వేల పెన్షన్‌ అందాలన్నా.. భవిష్యత్‌లో పెరగాలన్నా.. మీ జగనే రావాలి
ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ చెప్పాలి
చెప్పిన ప్రతీది చేసిన ప్రభుత్వం మనది
ప్రజలు నా స్టార్‌ క్యాంపెయినర్లు
జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి

పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి
రైతు భరోసా కొనసాగాలన్నా జగనన్నే మళ్లీ రావాలని చెప్పండి
పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్‌ నొక్కాం..
రూ.2 లక్షల 55వేల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం
మీరు నా కోసం ఒక్కసారి బటన్‌ నొక్కండి
ఒకటి అసెంబ్లీ,ఒకటి పార్లమెంట్‌కు ఫ్యాన్‌ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు
ప్యాకేజీ కోసం రా.. కదలిరా అంటూ బాబు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు
చంద్రబాబు అండ్‌ కో.. నాన్‌ రెసిడెంట్ ఆంధ్రాస్‌
175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు
చంద్రబాబు అండ్‌కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా
చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు ఏపీతో ఏం సంబంధం
దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిషత్తునే టార్గెట్‌ చేసుకుంటున్నాయి
ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ04:10 PM, Feb 3, 2024
దెందులూరులో భారీ జనసందోహానికి సీఎం జగన్‌ అభివాదం

 • సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
 • దెందులూరులో జగనన్న ప్రభంజనం కనిపిస్తోంది: అబ్బయ్య చౌదరి
 • ఎటుచూసిన వైఎస్సార్‌సీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి.
 • విశ్వసనీయతకు మారు పేరు సీఎం జగన్‌
 • సీఎం జగన్‌ రంగంలోకి దిగితే వార్‌ వన్‌సైడే
 • పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధానికి మేం సిద్ధం
   

03:56 PM, Feb 3, 2024
సిద్ధం సభావేదికపై వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

 • సిద్ధం సభావేదికపై వైఎస్సార్‌కు నివాళి అర్పించిన సీఎం జగన్‌, వైఎస్సార్‌సీపీ నేతలు
 • భారీ వాక్‌ వేపై పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్‌ 
 • 50 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

03:41 PM, Feb 3, 2024
సిద్ధం వేదికపైకి సీఎం జగన్‌

 • ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ
 • సిద్ధం సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్‌
 • ‘సిద్ధం’ పాటతో మారుమోగుతున్న దెందులూరు సభా ప్రాంగణం
 • కాసేపట్లో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్‌

03:29 PM, Feb 3, 2024
దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

 • హెలికాఫ్టర్‌లో దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌
 • దెందులూరులో వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ
 • వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొననున్న సీఎం జగన్‌
 • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్‌

03:22 PM, Feb 3, 2024
సిద్ధం సభ ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది: మంత్రి వేణు

 • అంబేద్కర్‌ చెప్పిన సామాజిక న్యాయాన్ని జగన్‌ చేతల్లో చూపించారు
 • సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది
 • చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
 • కుట్రలు చేయడమే చంద్రబాబు పని

03:15 PM, Feb 3, 2024

సీఎం జగన్‌ పేదల పక్షపాతి: ఆళ్ల నాని

 • ప్రతిపక్షాలు సీఎం జగన్‌ను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి
 • ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు సీఎం జగన్‌
 • పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకొని జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారు.
 • పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది

03:00 PM, Feb 3, 2024

 • తాడేపల్లి నుంచి దెందులూరు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
 • కాసేపట్లో‌ ఏలూరు సిద్దం సభకు హాజరు

జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం: కొట్టు సత్యనారాయణ

 •  మా ప్రజాబలం చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది.
 • సీఎం జగన్‌ వెంటే ప్రజలు ఉన్నారు.
 • 175కు 175 సీట్లు గెలవడమే మా టార్గెట్‌

జగన్‌కు ఉన్న స్టార్‌ క్యాంపెయినర్లను చూశారా?

 • వైస్సార్‌సీపీకి సామాన్య ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు 
 • పచ్చ బ్యాచ్‌కు మాత్రం దండిగా స్టార్‌ క్యాంపెయినర్లు
 • చంద్రబాబుకి సపోర్ట్‌గా దత్తపుత్రుడు పవన్‌, వదిన.. బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి
 • రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో ఉన్న బాబు అభిమాన సంఘం
 • పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ప్రభుత్వంపై విద్వేషం గుప్పించే యెల్లో మీడియా
 • కానీ, సీఎం జగన్‌కు నో స్టార్‌ క్యాంపెయినర్లు
 • వైఎస్సార్‌సీపీకి సామాన్యులే క్యాంపెయినర్లు
 • అందుకు ప్రత్యక్ష తార్కాణం..  ఏలూరు దెందలూరు సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రభంజనం

02:30 PM, Feb 3, 2024

తూర్పుగోదావరి జిల్లా

 • ఏలూరు సిద్ధం సభకు భారీగా తరలి వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు...
 • రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో తరలింపు.

అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాం: రాజమండ్రి ఎంపీ భారత్‌.

 • రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలంతా మేము సిద్ధంగా ఉన్నామని సభకు వస్తున్నారు.
 • మేము సిద్ధం అంటే .. సంసిద్ధం అంటూ ప్రతిపక్షాలు  అనడం సిగ్గుచేటు.
 • ఒక పార్టీ ఇచ్చిన నినాదాన్ని మరొక పార్టీ కూడా ఫాలో అయ్యే పరిస్థితికి ప్రతిపక్షాలు దిగజారిపోయాయి.
 • రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు పెద్దపీఠం వేసి మేము ఎన్నికలకు సిద్ధ పడుతున్నాం.
 • మేము 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించి మేము సిద్ధం అంటున్నాం.
 • మీరు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సంసిద్ధం అని చెప్పండి.. ఊరికనే కాదు.

01:50 PM, Feb 3, 2024

కృష్ణాజిల్లా

 • దెందులూరులో జరిగే సిద్ధం సభకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుండి 100 బస్సుల్లో బయల్దేరిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.

 • సిద్ధం సభకు బస్సు డ్రైవర్‌గా  మారిన మాజీ మంత్రి పేర్ని నాని.
 • కార్యకర్తలతో వెళ్తున్న బస్సును స్వయంగా నడిపిన పేర్ని నాని.

01:30 PM, Feb 3, 2024

ఎన్టీఆర్ జిల్లా:

 • జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సిద్ధం సభకు భారీగా బయలుదేరిన వాహన శ్రేణులు
 • జాతీయ రహదారిపై జెండా ఊపి బస్సులను ప్రారంభించి వారితో సభకు కలిసి వెళ్లిన ఉదయభాను.
 • దెందురూరులో,సీఎం జగన్‌ సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
 • దెందురూరులో సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు..

12:50 PM, Feb 3, 2024

తూర్పుగోదావరి జిల్లా:

 • రాజానగరం నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా సిద్ధం సభకు తరలిన అభిమానులు, కార్యకర్తలు

కృష్ణా జిల్లా: 

 • పెనమలూరు,కంకిపాడు, ఉయ్యూరు నుండి దెందులూరు  సిద్ధం బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు.
 • దెందులూరు లో సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు పెడన నియోజకవర్గం ఇన్చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

12:26PM, Feb 03, 2024

సిద్ధం సభకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తరలివెళ్లిన కార్యకర్తలు

 • కార్యకర్తలతో కలిసి బయల్దేరిన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా
 • బస్సుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి

12:20PM, Feb 03, 2024

వైఎస్‌ జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం: మంత్రి చెల్లుబోయిన

 • మరో ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం
 • దెందులూరు సిద్ధం సభను విజయవంతం చేస్తాం
 • సేవే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్‌ కోసం మేమంతా సిద్ధం
 • నాయకుడి లక్ష్యం నెరవేర్చడమే పార్టీ కేడర్‌ ఉద్దేశం
 • సిద్ధం సభ.. దేశ రాజకీయాల్లో సేవే లక్ష్యమని చాటి చెప్పడం
 • సేవకి సైన్యం సిద్ధమైంది

12:15PM, Feb 03, 2024
గుడివాడ నుండి సిద్ధం సభకు వేలాదిగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు

 • దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో గుడివాడ నుండి వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
 • గుడివాడ VKR VNB ఇంజనీరింగ్ కళాశాల వద్ద పార్టీ శ్రేణుల బస్సు ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్.
   

12:00 PM, Feb 3, 2024

 • కృష్ణా జిల్లా: మచిలీపట్నం నుంచి సిద్ధం సభకు బస్సుల్లో కదలిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
 • కార్యకర్తలతో కలిసి బయల్దేరిన బస్సులో దెందులూరు బయల్దేరిన కృష్ణాజిల్లా వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు.

11:30 AM, Feb 3, 2024

 • వైఎస్సార్‌సీపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా నుంచిమంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో దెందులూరు బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు.
 • దెందులూరు సిద్ధం సభకు రాజమండ్రి నుంచి భారీగా బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు.
 • ఎంపీ భరత్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు,  కార్లలో తరలి వెళ్తున్న పార్టీ కార్యకర్తలు,  అభిమానులు
 • సీఎం జగన్ సభను విజయవంతం చేసేందుకు ఉత్సాహంతో బయలుదేరిన అభిమానులు

11:23AM, Feb 03, 2024

ఎన్టీఆర్ జిల్లా:

 • తిరువూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు
 • జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జ్‌ నల్లగట్ల స్వామిదాస్

11:20AM, Feb 03, 2024

ఏలూరు జిల్లా: 

 • కైకలూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు
 • జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 

11:10 AM, Feb 3, 2024

 • ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 
 • ఏలూరు జిల్లా: కైకలూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన  ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు.

సాక్షి, ఏలూరు: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమగోదావరిలో 15, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు మొత్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ముఖ్యనేతలతో పాటు పార్టీ కార్యకర్తలు, పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు, ప్రజలు లక్షలాది మంది సభకు తరలిరానున్నారు.

175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్‌ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు

ఏలూరు ఆటోనగర్‌–దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో 110 ఎకరాల ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం ముస్తాబు చేశారు.  ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పా­ర్కింగ్‌ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. సభా వేదిక నిర్మాణం, వేదిక ముందు భాగంలో ‘ఫ్యాన్‌’ గుర్తులో వాకింగ్‌వే ఏర్పాటుచేశారు. ప్రతి గ్యాలరీలో మంచినీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లతో పాటు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచారు.

సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన పార్టీ ఫ్లెక్సీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ‘మేం సిద్ధం’ అంటూ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలతో ప్రాంగణాన్ని నింపేశారు. పదుల సంఖ్యలో సీఎం జగన్‌ భారీ కటౌట్‌లను స్థానిక నేతలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15కు పైగా భారీగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్‌ సిద్ధమైంది.

సీఎం షెడ్యూల్‌
‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్‌ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్‌ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం  హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్‌లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.  

Advertisement
 
Advertisement