
పులస చేపను వేలంలో దక్కించుకున్న పొన్నమండ రత్నం
‘పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలి’ అనే నానుడి గోదావరి జిల్లాలో బాగా విపిస్తుంటుంది. ‘పులస’ చేప దొరకడం చాలా అరుదు కాబట్టే.. జీవితంలో ఒక్కసారైనా పులసను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. అంతేకాదు ఈ చేప ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకే వేలంలో ఎంత ధర పెట్టడానికైనా జనాలు వెనుకాడరు. ఇప్పటికే ఎన్నో పులస చేపలు రికార్డు ధరలో అమ్ముడుపోయాయి.
యానాం: గోదావరికి వరద ఉధృతి పెరుగుతుండటంతో మత్స్యకారుల వలలకు పులసలు చిక్కుతున్నాయి. శుక్రవారం యానాం (Yanam) గౌతమీగోదావరి పాయలో తొలిసారిగా పులస చేప వలకు చిక్కింది.
దీంతో స్థానిక పుష్కరఘాట్ వద్ద పులస చేపను వేలం వేయగా స్థానిక మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం రూ.15 వేలకు చేపను దక్కించుకుంది. ఆపై మార్కెట్ లో రూ.18 వేలకు విక్రయించారు.
గోదావరికి ఎర్రనీరు రావడంతో అరుదైన గోదావరి పులస (Pulasa) పడటంతో మిగిలిన ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు పులసలు పడతాయని మత్స్యకారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: జూలైలోనూ వేసవే.. మండుతున్న ఎండలు!