ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు ఊరట | Public Representative Court Dismisses Case Against YS Sharmila and Vijayamma At Parakala | Sakshi
Sakshi News home page

2012 పరకాల సభ కేసు: ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు ఊరట

Published Thu, Sep 30 2021 4:04 PM | Last Updated on Thu, Sep 30 2021 4:11 PM

Public Representative Court Dismisses Case Against YS Sharmila and Vijayamma At Parakala - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, విజయమ్మకు ఊరట లభించింది. అనుమతులు లేకుండా పరకాలలో సభ నిర్వహించి.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని 2012లో విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు షర్మిల, విజయమ్మపై నమోదైన కేసును కొట్టేసింది. 
(చదవండి: వైఎస్‌ విజయమ్మ సైకత శిల్పం)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల కార్యక్రమం నిర్వహించారని విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లోనే పరకాల పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదు చేశారు. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసును కొట్టేసింది.

చదవండి: నా బిడ్డలిద్దర్నీ ఆశీర్వదించండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement