కోర్టుకెళ్తే మీ బండారం బయట పెడతా | Police arrested 15 persons for gambling in Pakala Mandal | Sakshi
Sakshi News home page

కోర్టుకెళ్తే మీ బండారం బయట పెడతా

May 1 2026 4:36 AM | Updated on May 1 2026 4:36 AM

Police arrested 15 persons for gambling in Pakala Mandal

చంద్రబాబుతో ప్రదీప్‌ (ఫైల్‌), తిరుపతి జిల్లా పాకాల మండలంలో పేకాట ఆడుతూ పట్టుబడిన నిందితుల్లో చంద్రబాబు సన్నిహితుడు ప్రదీప్‌

పోలీసులకు సీఎం సన్నిహితుడి బెదిరింపు

పేకాట ఆడిస్తూ అడ్డంగా దొరికి దబాయింపు

స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపిన వైనం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పేకాట అడిస్తూ పట్టుబడిన సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితుడు ప్రదీప్‌రెడ్డి పోలీసులను బెదిరించారు. కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తే మీకు (పోలీసులకు, ఎమ్మెల్యేకు) క్రమం తప్పకుండా ఇస్తున్న మామూళ్ల సంగతి కూడా చెబుతానని హెచ్చరించారు. పాకాల మండలం చెన్నుగారిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం రహస్యంగా పేకాట ఆడుతున్నట్టు డ్రోన్‌ కెమెరాల ద్వారా బట్టబయలైంది. తిరు­పతి ఎస్పీ కార్యాలయం ఆధీనంలోని కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది అప్రమత్తమై స్పెషల్‌ పార్టీ పోలీసులకు ఆ డ్రోన్‌ వీడి యోలు, లొకేషన్‌ పంపించారు.

వాటి ఆధారంగా స్పెషల్‌ పార్టీ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసు­కున్నారు. వీరిలో ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మరో ఇద్దరు ఎమ్మెల్యే నానికి అత్యంత సన్నిహి­తులు. వీరి ఆధ్వర్యంలోనే పేకాట సాగుతోంది. ఈ క్రమంలో వీరిని ఎలాగైనా తప్పించాలని ఎమ్మెల్యే నాని పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికే విషయం మీడియాకూ తెలి­యడంతో పోలీసులు కేసులు నమోదు చేశా­రు. దీంతో ప్రదీప్‌రెడ్డి పోలీసు­లను బెదిరించారు. పై నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో పోలీ­సులు సదరు నిందితులకు రాచమ­ర్యా­దలతో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement