అమరావతిలో ఏబీఎన్‌ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు? | Perni Nani About MAVIGUN | Sakshi
Sakshi News home page

అమరావతిలో ఏబీఎన్‌ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు?

May 11 2026 3:40 PM | Updated on May 11 2026 5:40 PM

Perni Nani About MAVIGUN

సాక్షి,తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్‌ కరప్షన్‌ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్‌  అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ఫ్లాట్లు ఉండొద్దా? రాధాకృష్ణ పిల్లలకు మాత్రం ప్లాట్లు ఇస్తారు. మిగితా వారికి అభివృద్ధి జగరని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారు. చంద్రబాబు బినామీలకు న్యాయం జరుగుతోంది. కళ్లముందే భారీ దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్. మావిగన్ రాజధానికి సిరులు కల్పిస్తుంది. దీనిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నిస్తే  చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పైగా తన మంత్రులతో వైఎస్‌ జగన్‌ని దూషిస్తున్నారు.

అమరావతిలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది. అవినీతికి మారుపేరుగా అమరావతిని తయారు చేశారు.అవినీతే కాదు, వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోంది. సీఆర్‌డీఏ చట్టంలోని ఏ రూలు కూడా చంద్రబాబు, ఆయన మనుషులకు వర్తించవు. ఆ రూల్స్ అన్నీ సామాన్య ప్రజలు, రైతులకే చంద్రబాబు ఇల్లు ఈ6 రోడ్డులో కడుతున్నారు.

ఆ స్థలం ఇచ్చిన రైతు కంచర్ల కుటుంబానికి అక్కడే ఎందుకు స్థలం ఇచ్చారు?.2024లో వారికి ప్లాటు కేటాయించటం, 2025లో చంద్రబాబు కొనుక్కున్నారు. ఐదు ఎకరాల్లో చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏం ప్యాలెస్ అనాలి?.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ప్లాటు ఎలా వచ్చింది?.

సాధారణ రైతులకు ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వరు?. చంద్రబాబు కడుతున్న ఇంటి పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారు.మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఎలా ఇచ్చారు?.బెజవాడ రమేష్‌కు నాలుగు ప్రధాన రోడ్ల మధ్యలో ఎలా ఇచ్చారు?.

చంద్రబాబు మనుషుల్లోని కమ్మవారికే రాజధానిలో న్యాయం చేస్తున్నారు.మిగతా కమ్మ వారికి ఎందుకు న్యాయం చేయటం లేదు?. సుబ్బారావు అనే టీడీపీ నేతకు కూడా హైకోర్టు పక్కనే ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను గెటవుట్ అంటూ అవమాన పరుస్తున్నారు. ఆయన ఎదుట సెల్‌ఫోన్ లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మంత్రి చేష్టలకు రాజధాని రైతులు తీవ్రంగా అవమాన పడుతున్నారు. జూన్ లో వర్షాలు పడితే అమరావతిలో మళ్ళీ నీళ్లు నిలపడతాయి

పనులన్నీ ఆగిపోతాయి, ‌మరి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?. ఇక ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు ఆరు నెలలు మాత్రమే. ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి. రెండో విడత భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు వైఎస్సార్‌సీపీ నిషేధం. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాం. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు కడుతున్నారు

మీరు ఆచరించి ప్రజలకు చెప్పండి..  స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగకుండా..

సంవత్సరానికే చంద్రబాబు ఇల్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. నగరాలు, రాజధానులను ప్రభుత్వం కట్టిన సందర్భాలు లేవు.అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్లా?. ఇంత దోపిడీ ఎక్కడా జరగలేదు. రైతులు కన్నీరు పెట్టిన ఏ రాజ్యం బాగు పడలేదు. జనాన్ని కార్లలో తిరగవద్దంటున్న ప్రధాని మోదీ కూడా రైళ్లలో తిరిగితే బాగుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కలిసి ఒకే కారులో తిరిగితే మంచిది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.అక్కడికి ప్రధాని మోదీ వెళ్లటం ఏపీ ప్రజల ఖర్మ. రాజధానిలో కట్టే ప్రతి ప్రభుత్వ బిల్డింగ్ సీఆర్‌డీఏకు అద్దె కట్టాలి ఇది అత్యంత దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement