చంద్రబాబుపై ఎమ్మెల్యే శ్రీధర్‌ విమర్శలు వెంటనే చర్యలు తీసుకున్న పవన్‌ | Pawan Kalyan Serious on Jana Sena MLA Arava Sridhar | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఎమ్మెల్యే శ్రీధర్‌ విమర్శలు వెంటనే చర్యలు తీసుకున్న పవన్‌

May 24 2026 5:59 AM | Updated on May 24 2026 5:59 AM

Pawan Kalyan Serious on Jana Sena MLA Arava Sridhar

పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి మోసం చేశాడంటూ ఐదారు నెలలుగా ఓ మహిళా ఉద్యోగిని ఆవేదన

రెండ్రోజుల కిందట ఒక వర్గం మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన వీడియో వైరల్‌

అయినా కనీస చర్యలు తీసుకోని పవన్‌

తాజాగా సీఎం చంద్రబాబు వేస్ట్‌ అంటూ శ్రీధర్‌ మాట్లాడిన మరో వీడియో హల్‌చల్‌ 

దీంతో ఆగమేఘాల మీద అరవ శ్రీధర్‌పై చర్యలు

సాక్షి, అమరావతి/రైల్వేకోడూరు: రైల్వేకోడూ­రు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మహిళలను వేధించినా, ఒక వర్గం మహిళలను కించపరిచినా ఇప్పటివరకు చర్యలు తీసుకోని పవన్‌ కళ్యాణ్‌..­అరవ శ్రీధర్‌ చంద్రబాబును ఒకమాట అన్నట్లు వీడియో బయటకు రాగానే వెంటనే చర్యలు తీసుకున్నారు. దాదాపు ఐదారు నెలలుగా ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని..  అరవ శ్రీధర్‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్‌ చేయించి  మోసం చేశాడని మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా తె­లి­సిందే. 

అయినా ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ నుంచి కనీస స్పందన లేదు. రెండురోజుల కిందట ఒక వర్గం మహిళలను అత్యంత దారుణంగా కించ­పరుస్తూ శ్రీధర్‌ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపైనా పవన్‌  చర్యలు తీసుకోలేదు. తాజాగా సీఎం చంద్రబా­బు.. వాడు వేస్ట్‌.. అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ అరవ శ్రీధర్‌ మాట్లాడిన వీడియో సైతం వైరల్‌ అవుతుండడంతో హడావుడిగా విప్‌ పదవి­కి జన­సేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆయనతో రాజీ­నా­మా చేయించారు. ఈ మేరకు శనివారం ఉప ము­ఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌­కళ్యాణ్‌­­ను కలిసి అరవ తన రాజీనామా లేఖను అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. 

మహిళల విషయంలో స్పందించకుండా..   చంద్రబాబును అనగానే ఆగమేఘాలపై చర్యలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో సమా­వేశం తర్వాత అరవ శ్రీధర్‌ విప్‌ పదవికి రాజీ­నామా చేసినట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యా­లయం ఓ లేఖను మీడియాకు విడుదల చేసింది. ప్రభుత్వంలో కీలక పదవి­లోనే ఉన్న అరవ శ్రీధర్‌ రాసలీలల వీడియోల వ్య­వహారం గత ఐదారు నెల­లుగా అటు జనసేన పార్టీ­లో, ఇటు కూటమిలోనూ రాజకీయ దుమారం రేపుతున్నా పవన్‌ కళ్యాణ్‌ కనీసం స్పందించలేదు. ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. తాజాగా ఒక వర్గం మహిళలను దారుణంగా కించప­రు­స్తూ మాట్లాడిన ఆడి­యో వైరల్‌ అవుతోంది.

ఈ విషయంలో సర్వ­త్రా ఆగ్రహజ్వాలలు వ్య­క్తం అవుతున్నా కూడా పవన్‌ కనీసం ఖండించలేదు.. అయితే సీఎం చంద్రబాబును వేస్ట్‌ అంటూ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో ఆగమేఘాలపై ఆయన్ని పిలిపించి రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్యే శ్రీధర్‌పై ప్రభుత్వ మహిళా ఉద్యోగిని మోసం చేశాడనే ఆరోపణలు రావడంతో నేప­థ్యంలో ముగ్గురు నేతలతో జనసేన నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అయితే దాదాపు నాలుగు నెలలుగా పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ప్రభుత్వ విప్‌ హోదాలో అరవ శ్రీధర్‌ మాత్రం పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రెండు నెలల క్రితం అతని అనుచరులు నడిరోడ్డుపై బాధిత మహిళా ఉద్యోగి మీద పోలీసుల సమక్షంలోనే దాడికి కూడా పాల్పడ్డారు. మరోవైపు.. అరవ శ్రీధర్‌ రెండురోజుల కిందట ఓ సామాజిక వర్గం మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవు­తోంది. దీంతో పవన్‌కళ్యాణ్‌ తమ పార్టీ ఎమ్మెల్యే మహిళలను మోసం చేసినా.. ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడితే స్పందించకపోగా.. చంద్రబాబు విషయానికి వచ్చేసరికి తక్షణ చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 

తీవ్ర అవినీతి ఆరోపణలున్న మరో ఎమ్మెల్యేతో భేటీ
ఇటీవల కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎ­దుర్కొంటున్న పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైతం శనివారం పార్టీ అధినేత పవన్‌­కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పార్టీ దృష్టికి వచ్చిన విషయాలు, ఆరోపణలపై ఎమ్మెల్యే బాలరాజు­ను అధినేత పవన్‌కళ్యాణ్‌ వివరణ అడిగారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. తన వ్యక్తి­గత విషయాలను కుటుంబ సభ్యు­లతో నాలుగు వారాల్లోగా చక్కదిద్దుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ ఎమ్మెల్యేకి గడువు ఇచ్చారని పార్టీ తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement