చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం | Nandamuri Lakshmi Parvathi comments over Chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం

Mar 30 2026 3:43 AM | Updated on Mar 30 2026 3:43 AM

Nandamuri Lakshmi Parvathi comments over Chandrababu naidu

ఎన్టీఆర్‌ నుంచి టీడీపీని లాక్కున్న బాబు క్రెడిట్‌ చోర్‌ 

పార్టీ ఆశయాలను సైతం చంద్రబాబు తుంగలో తొక్కారు 

వైఎస్‌ జగన్‌ పాలనకు చంద్రబాబు ఎక్కడా సరితూగరు 

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించి, ఇప్పుడు ఆవిర్భావ వేడుకల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీని ఎన్టీఆర్‌ నుంచి లాక్కున్న చంద్రబాబు క్రెడిట్‌ చోర్‌ అని దుయ్యబట్టారు. టీడీపీ, ఎన్టీఆర్‌ పేరెత్తే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలను పూర్తిగా తుంగలోకి తొక్కి, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబుకు ఏమాత్రం రాజకీయ విలువలు లేవన్నారు. 

ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని క్రమశిక్షణ లేని పార్టీగా, నైతిక విలువలు లేని పార్టీగా మార్చింది చంద్రబాబేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచిన సందర్భంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించవద్దని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు. జగన్‌ సంక్షేమ, అభివృద్ధి పాలనతో చంద్రబాబు ఎక్కడా, ఏ విషయంలోనూ సరితూగరని స్పష్టం చేశారు. 

చంద్రబాబుకు వేడుకలు చేసే అర్హత లేదు.. 
కామపిశాచుల్లా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతలను ఒక్కరినైనా సస్పెండ్‌ చేశారా అని లక్ష్మీపార్వతి నిలదీశారు. పొత్తుల కోసం అంటకాగిన పార్టీగా టీడీపీని మార్చేసిన చంద్రబాబుకు ఆవిర్భావ వేడుకలు నిర్వహించే అర్హత లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనులు లేవని, బాబు జీవితమంతా అబద్ధాలతోనే బతుకీడుస్తున్నారని దుయ్యబట్టారు. 

చంద్రబాబు చేసేది రాజకీయం కాదని, బ్రోకరిజం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియా వల్ల రాష్ట్రంలో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వ పనితీరు మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబును తాను మనిషిగా కూడా గుర్తించటం లేదని, జీవిత చరమాంకంలో ఉన్న బాబు ఇకనైనా మారాలని హితవు పలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement