Nara Lokesh: జల విలయంలో ప్రజలు.. హైదరాబాద్‌కు లోకేష్‌ | Minister Nara Lokesh Visits Hyderabad On Sep 1st | Sakshi
Sakshi News home page

Nara Lokesh: జల విలయంలో ప్రజలు.. హైదరాబాద్‌కు లోకేష్‌

Sep 2 2024 3:33 PM | Updated on Sep 2 2024 4:08 PM

Minister Nara Lokesh Visits Hyderabad On Sep 1st

సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాల కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి బతుకు జీవుడా అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి సమయంలో బాధ్యతలు మరచిని మంత్రి నారా లోకేష్‌.. నిన్న హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ నేడు విజయవాడకు వచ్చారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోకుండా ఆయన హైదరాబాద్‌కు వెళ్లడంతో ప్రజలు మం‍డిపడుతున్నారు. 

విజయవాడలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను వదిలి మంత్రి నారా లోకేష్‌.. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. కరకట్ట నివాసానికి వరద ముప్పు కారణంగా ఆయన హైదరాబాద్‌కు వెళ్లినట్టు సమాచారం. తిరిగి సోమవారం ఉదయం నారా లోకేష్‌ విజయవాడకు చేరుకున్నారు. అంతకుముందు కూడా నారా లోకేష్‌.. ఆదివారం ఉదయమే విజయవాడకు రావడం గమనార్హం. వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. తూతూ మంత్రంగా వరదల్లో ఉన్న వారిని ఏదో పరామర్శించినట్టుగా కలరింగ్‌ ఇచ్చి మళ్లీ వెళ్లిపోయారు. అయితే, విజయవాడ, మంగళగిరి నియోజకవర్గం పూర్తిగా వరదల్లో ఉన్నప్పటికీ ప్రజలను పట్టించుకోకుండా లోకేష్‌.. హైదరాబాద్‌ వెళ్లడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కూటమి సర్కార్‌, లోకేష్‌కు ప్రజల మీద ఉన్న శ్రద్ద అని మండిపడుతున్నారు. కొంచెమైనా బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

 

 

 కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరుకుంది.

 

బాధితుల ఆవేదన.. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement