
సాక్షి,అమరావతి: ఏపీలో నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది. .ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం రాకెట్ కేసులు కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్లో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం(అక్టోబర్ 10వ తేదీ) నారా లోకేష్‌తో ఆయన నివాసంలో టీడీపీ మంత్రులు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నకిలీ మద్యం తయారీ, బెల్టు షాపుల పెరుగుదల, వాటి వెనుక ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల గురించి చర్చ జరిగింది. ముఖ్యంగా బెల్టు షాపుల ద్వారా నకిలీ మద్యం సరఫరా అవుతుందన్న అంశంపై నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో ఎమ్మెల్యేలు బెల్టు షాపులను పెట్టిస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తద్వారా బెల్టు షాపులు బాగా పెరిగిపోయాయని అంగీకరించారు.
