స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో లోకేశ్‌ సర్టిఫికెట్ కొన్నారు: లక్ష్మీపార్వతి | Lakshmi Parvathi Allegations Against Chandrababu Naidu And Compares AP Rule To British Rule, More Details Inside | Sakshi
Sakshi News home page

స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో లోకేశ్‌ సర్టిఫికెట్ కొన్నారు: లక్ష్మీపార్వతి

May 31 2026 2:53 PM | Updated on May 31 2026 4:29 PM

Lakshmi Parvathi Allegations Against Chandrababu Naidu

తాడేపల్లి: బ్రిటిష్ కాలం నాటి విధానాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. బ్రిటిషర్లపై పోరాడినట్లే ఇప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 

మోసానికి రెండేళ్లు పేరుతో వైఎస్సార్‌సీపీ మహిళా నేతల సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడు మొదట ఇందిరా గాంధీకి వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నికలకు వెళ్లినందుకు కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోగానే చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లదగ్గర చేరాడు. చంద్రబాబును పార్టీలోకి తీసుకోవద్దని అందరూ వ్యతిరేకించారు.

లోకేశ్‌ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కొన్నారు. లోకేశ్‌ సెవెన్త్ క్లాస్ కూడా సరిగ‍్గా పాసవ్వలేదు. ఇలాంటి అసమర్థుడిని చంద్రబాబు ప్రజలపై రుద్దాలని చూస్తున్నాడు. మహిళల క్యార్టెక్టర్ ను కించపరచడమేనా చంద్రబాబు మహిళలకు చేసే మేలు. బాలకృష్ణ ఈ రోజు చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడంటే వైఎస్సార్ పెట్టిన భిక్ష. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చూడాలంటే మహిళల పైనే ఎక్కువ బాధ్యత ఉంది.

కానీ భార్యను అడ్డంపెట్టుకుని చంద్రబాబు ఎన్టీఆర్ ను బుట్టలో వేసుకున్నాడు. చంద్రబాబుకు ఎడారి ఒంటె కథ సరిగ్గా సరిపోతుంది. టెంటు కింద చోటిస్తే యజమానిని బయటకు తోసేసిన ఒంటె, చంద్రబాబు ఒకే రకం. చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు. ఎన్టీఆర్ తో నా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ పార్టీ నుంచి బయటికి పొమ్మంటే నన్ను బతిమిలాడుకున్నాడు. నేను పట్టుబట్టడం వల్లే చంద్రబాబును పార్టీ నుంచి బయటికి గెంటేయకుండా ఆగారు.

ఆ రోజు ఎన్టీఆర్ కు ద్రోహం చేయొద్దని నేను కోరాను. ఎన్టీఆర్ ను ఎప్పటికీ మోసం చేయనని నా చేతిలో చేయి వేసి, తన కొడుకుపై చంద్రబాబు ఒట్టు వేశాడు. నా దగ్గర ఒట్టు వేసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు చేయి తాకడం కూడా పాపమే. వైస్రాయ్ హోటల్ కు వెళ్లినందుకు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారు. అవమానిస్తే ఎన్టీఆర్ చనిపోతాడని తెలిసి తీవ్రంగా అవమానించారు. ఎన్టీఆర్ పై క్షుద్రపూజలు కూడా చేయించిన నీచుడు చంద్రబాబు’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement