మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్‌ ప్లాంట్‌కు శ్రీకారం | JSW CMD Sajjan Jindal thanks YS Jagan | Sakshi
Sakshi News home page

మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్‌ ప్లాంట్‌కు శ్రీకారం

Jul 4 2026 3:37 AM | Updated on Jul 4 2026 3:57 AM

JSW CMD Sajjan Jindal thanks YS Jagan

వైఎస్సార్‌సీపీ హయాంలో కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్‌ జగన్, జేఎస్‌డబ్ల్యూ సీఎండీ సజ్జన్‌ జిందాల్‌

వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన జేఎస్‌డబ్ల్యూ సీఎండీ సజ్జన్‌ జిందాల్‌ 

ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని వెల్లడి

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ముందస్తు అనుమతుల వల్లే కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు ఈ రోజు (శుక్రవారం) ప్రారంభమయ్యాయంటూ జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్‌ జిందాల్‌ తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుకు స్పందిస్తూ జిందాల్‌ తిరిగి పోస్టు పెట్టారు. 

మీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ముందస్తు అనుమతులు, నిరంతర కృషి వల్లే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందని  ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత యువత, కుటుంబాల కోసం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement