ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన | Heavy Rain Alert Issued for Several Districts in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

May 28 2026 7:53 PM | Updated on May 28 2026 8:04 PM

Heavy Rain Alert Issued for Several Districts in Andhra Pradesh

విజయవాడ: ఏపీలో అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. రోహిణి కార్తె ప్రారంభానికి ముందే ఏపీలో పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించగా, మళ్లీ ఏపీకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు.  

ప్రధానంగా పల్నాడు, ప్రకాశం,. నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.   ఈ క్రమంలోనే గంటకు 50కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో  ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

రెండు రోజుల క్రితం చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో  ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. 

అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement