యువత ఫిట్‌నెస్‌ మంత్ర  | Sakshi
Sakshi News home page

యువత ఫిట్‌నెస్‌ మంత్ర 

Published Thu, Dec 14 2023 5:38 AM

Greater interest in fitness among women - Sakshi

సాక్షి, అమరావతి :  మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలకు యువత ప్రాధాన్యం ఇస్తోంది. ఆ వరుసలో ఫిట్‌నెస్‌కు మొదటి స్థానం కల్పిస్తోంది. తాజాగా ఫోర్బ్స్‌ హెల్త్, వన్‌పోల్‌ 2024 సర్వేలో అమెరికన్లతో పాటు యావత్తు ప్రపంచ యువత వైఖరి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

48 శాతం మంది తమ ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడానికి ఓటు వేశారు.ఇందులో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక 36శాతం మంది మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు, 55 శాతం మంది శారీరక, మానసిక ఆర్యోగానికి సమాన ప్రాముఖ్యత కల్పించారు. ఇక వచ్చే ఏడాదైనా మేలైన ఆరి్థక స్థితి పొందాలని 38శాతం మంది   కోరుకున్నారు.   

‘బరువు’పైనే దృష్టి 
ప్రపంచాన్ని పీడిస్తున్న ఊబకాయ సమస్యను ఎదురించాలని యువత నిశ్చయించుకుంది. వయసుతో సంబంధం లేకుండా అధిక బరువును తగ్గించుకోవాలని 34శాతం మంది దృఢంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తినేలా జీవన విధానంలో మార్పు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. 20శాతం లక్ష్యాన్ని చేరుకోవడం, జవాబుదారీతనం పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఇది చాలా వరకు తగ్గింది.  

నితీరుపై... కేవలం 3శాతమే దృష్టి.. 
ఇక...అతి స్వల్పంగా 6శాతం మంది ప్రయాణాలను ఎంపిక చేసుకోగా 5శాతం క్రమం తప్పకుండా యోగ, 3శాతం మద్యపానం తగ్గించడం, మరో 3శాతం పనిలో మెరుగైన తీరును ప్రతిబింబించేలా తీర్మానాలు చేసుకున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయమేమంటే... ఆయా తీర్మానాలకు ఎక్కువ కాలం కట్టుబడి ఉండట్లేదు. ఇది సగటున కేవలం 4 నెలలు మాత్రమే కొనసాగుతోంది. 8శాతం మంది మాత్రమే నెల పాటు తమ లక్ష్యాల దిశగా ఆలోచిస్తున్నారు. 22 శాతం మంది రెండు/మూడు నెలలు, 13 శాతం మంది నాలుగు నెలలు కొనసాగిస్తుంటే, 6శాతం మాత్రమే ఏడాది పొడవునా అమలు చేస్తున్నారు.  

ఫిట్‌నెస్‌ యాప్‌లపై నజర్‌ 
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యువత ఫిట్‌నెస్‌ యాప్‌లను ఆశ్రయించనున్నారు. 30 శాతం మంది తమ తీర్మానాలు ఒకటి నుంచి రెండేళ్లలోనే ప్రభావాన్ని చూపిస్తాయని నమ్మితే.. 57శాతం మంది మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. 

Advertisement
 
Advertisement