రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము 

Grain purchase support price money into farmers accounts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు రూ.1,773.98 కోట్లు జమ చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం రూ.926.90 కోట్లను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినట్టు పేర్కొన్నారు. దాదాపు 16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలు అన్నింటికీ నగదు జమ చేశామన్నారు.

ఇప్పటి వరకు 3,10,791 మంది రైతుల నుంచి రూ.3,578.43 కోట్ల విలువైన 17.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటి వరకు 1.67 లక్షల మంది రైతులు మద్దతు ధర నగదును అందుకున్నట్టు వివరించారు. త్వరలోనే మిగిలిన రైతులకూ మద్దతు ధరను ఖాతాల్లో వేస్తామని తెలిపారు. రైతులకు గోనె సంచులు, హమాలీ, రవాణా ఖర్చుల కింద రూ.17.66 కోట్లు అందించినట్టు వివరించారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top